Wednesday 10 April 2013

మాంత్రికసాహిత్యం గురించి ఒక చిన్న పరిశీలన

తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ నేను సాహిత్యం చదువుకోలేదు..ఆ భాగ్యం కలగలేదు.
ఇక్కడ రాస్తున్నవి నేను గమనించినవీ అనుకున్నవీ మాత్రమే.వీటిలోని లోపాలని ఎవరయినా యెత్తిచూపవచ్చు.


పాశ్చ్యాత్య దేశాల్లోని   చాలా ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో 'డిపార్ట్ మెంట్  ఆఫ్ ఫోక్ లోర్ ' వుంటుందని ఈ మధ్యే తెలిసి ఆసక్తిగా అనిపించింది.ఇది ఇప్పటి ఆంగ్ల సాహిత్యం లో ఒక విభాగం ...చాలా ముఖ్యమైన విభాగంగా చెప్పదగిన 'ఫాంటసీ' చాలా సార్లు దీనిమీద ఆధారపడుతుంది.
        
క్రిస్టియానిటీ  పశ్చిమదేశాలన్నిటా  వ్యాపించకపూర్వం అక్కడి జీవనవిధానమూ,నమ్మకాలూ,వూహలూ..ఇవి.
ప్రధానంగా సెల్టిక్, నార్స్ ఈ 'విశ్వాసాలలో కొన్ని.
 క్రిస్టియానిటీ ముఖ్యంగా 'నీతి '  మీద కేంద్రీకరించబడి  వుంటుంది.రోజువారీ ప్రవర్తనకి చాలా మంచి మార్గదర్శక సూత్రాలని ఇచ్చివున్నప్పటికీ అందులో 'వూహ ' కి చోటు తక్కువ..గ్రీక్,రోమన్ నాటకాలనీ ,ఇలియడ్,ఒడిస్సీ లనీ  వాటి విభిన్నత కోసం  కూడాచదువుకునే వారనాలి..1500 లకి ముందు ఇంచుమించు సర్వత్రా వున్న కాథలిక్  సంప్రదాయం లో ఏంజెల్స్ వంటి మానవాతీతుల ప్రస్తావన వున్నా నేరుగా  మతంతో సంబంధం లేని 'కథలు ' సామాన్యులకీ పండితులకీ కూడా అవసరమే..కాథలిక్ సంప్రదాయాన్ని  ధిక్కరించిన ప్రొటెస్టెంట్ పద్ఢతిలో అభూతకల్ప న లకి చోటులేదు,కానీ
ఆశ్చర్యకరంగా  ఆ   తర్వాతే షేక్స్పియర్ వచ్చాడు.ఇది సహజమే,మనసులకి కొంత స్వేచ్ఛ    వచ్చి వుండాలి. 
 ఇంగ్లండ్ చరిత్రని మాత్రమే కాకుండా తనకాలం నాటికి చెప్పుకునే ఇతర   గాథలని కూడా నాటకీకరించాడు.
చాలావాటిలో మానవాతీతశక్తుల ప్రస్తావన వస్తూ వుంటుంది.
   ఇక్కడ తలచుకోవలసింది మిడ్ సమ్మర్ నైట్స్  డ్రీం   గురించి.
'మంత్రనగరి సరిహద్దులు ముట్టకు ' అని శ్రీశ్రీ ఎందుకు రాసాడోగాని ,ఈ సరిహద్దులకి  చాలా  ప్రాముఖ్యత వుంది.
వేసవి నడిమధ్యరోజు రాత్రిలోనూ, శీతాకాలపు మధ్య రాత్రిలోనూ మనుషుల ప్రపంచానికీ ఫెయిరీ లోకాలకీ నడుమ వుండే ద్వారాలు తెరుచుకుంటాయి,అదీ కొన్ని కొన్ని ప్రదేశాలలో అని అక్కడి పాత నమ్మకం.
  ఈనాటకం   మనుషులూ ఫెయిరీ లూ పిక్సీలూ [మన కిన్నరులూ గంధర్వులూ లాంటివారు ] కలిసి అడుకునే దాగుడుమూతలాట.వీరి ప్రస్తావనకి సాహిత్యంలో ఇదివరకు లేని సాధికారతని షేక్ స్పియర్ కల్పించాడు. ఆ ప్రభావం ఒక నూట యాభయి యేళ్లు కొనసాగింది,'నవల '  పుట్టే దాకా.
మొదటి నవలలు ఇంచుమించు  అన్నీ  సముద్రయానకథలూ, సాహసగాథలూ.
జర్మనీ లో గ్రిం  సోదరుల సేకరణ మొదలయినా,ఛార్లెస్ పె  రా ల్ట్  ఫ్రాన్స్ లో అదే పని చేసినా అవి ప్రధాన స్రవంతి  లోవి కావు.
గోథిక్ నవలలో చాలాభాగం చివరికి తేలేది ఆ జరిగిన వింత సంఘటనలన్నిటికి  సాధారణ ప్రపంచం లోదే  ఒక దాగివున్న కారణమనే.
ఇక్కడ మినహాయింపు బ్రాం స్టోకర్ 'డ్రాకులా ',మేరీ షెల్లీ ఫ్రాంకెన్ స్టీన్ . .అయితే మొదటి దానిలో పరోక్షంగా మతవిశ్వాసాల గెలుపు వుంటే, రెండో దానిలో దైవసృష్టి  కాని దేనికీ మనుగడ వుండదని తేలుతుంది. విక్టొరియన్  నవలలలో 'వుదరింగ్ హైట్స్ లాంటి కొన్నిటిలో తప్ప మానవాతీత  శక్తుల వునికి అంతగా వుండదు

.ఇక్కడ ఆకర్షించే విషయం యెమిటంటే ఈ కాలం లో ' ఘోస్ట్ స్టోరీ ' లు చాలా విస్తృతంగా   రావటం.వాటిని సాహితీ ప్రక్రియలుగా వొప్పుకోవలసి వచ్చింది..విక్టొరియన్  కాలం లోనే విలియం మోరిస్ మొదటి ఫాంటసీ నవలలు  రాసాడు. the wood beyond the world,The well at the world's end.. ..ఆ పేర్లే ఎంతో మార్మికంగా వుంటాయి.జార్జ్ మెక్డొనాల్డ్ ఇంచుమించు అప్పుడే రాసినprincess and the goblin నీ .Lewis caroll రాసిన Alice in the wonderland నీ   అప్పటికి బాలసాహిత్యం గానే గుర్తించారు.
వలసలు అంతరించటమూ, ఒక ప్రపంచ యుద్ధం జరగటమూ అయాక కానీ ఫాంటసీ ఒక స్వతంత్ర ప్రక్రియగా నిలదొక్కుకోలేదు.అందుకుJ.R.R.Tolkien  రావలసి  వచ్చింది  .ఈయన రచనా పద్ధతి సాంప్రదాయికంగానే వున్నా సృస్టించిన లోకాలు అన్నీ అతి నూతనమయినవి.వాటి మూలాలు ఫోక్ లోర్ నుంచి వచ్చాయి!!
అదే కాలపు సి. యస్. లూయిస్ మతం వైపునుంచి నార్నియా ని  సృష్టించాడు , అది కూడా నిలబడింది.   ఆ తర్వాత ఫాంటసీ  ఇంక వెనక్కి తిరగలేదు. మంచి రచయితలు ఎందరో  ఈ సాహిత్యాన్ని  సంపన్నం చేసారు
 పాశ్చాత్య  సాహిత్య ప్రతిధ్వనిని మోడరన్, పోస్ట్  మోడరన్  కాలాలలో  మనం ఇక్కడ వింటూనే వు న్నాము .
మార్క్వీజ్ నుంచి మాజిక్ రియలిజాన్నితెచ్చుకున్నాము .
  భారతీయ సాహిత్యంలో అద్భుతరసానికి కొరత యెమీ లేదు,అసలు ఫాంటసీ ని విడదీసి చూడటమే కష్టం.
అలాంటిది సమకాలీన తెలుగు సాహిత్యంలో ;అద్భుతం ' కనపడదు.
హారీ పోటర్    జయించి చాలాకాలమయింది,Twilight  కూడా అదే పని చేసింది.ఇండొ ఆంగ్లికన్ లోImmortalas of meluha వచ్చింది  .best seller లు అయినంతమాత్రాన అవి సాహిత్యం కావని అనక్కర్లేదుRider haggard.నవలలు P.G.Wodehouse నాటికి pulp fiction  అని ఆయన చెప్తాడుCharles Dickens,Wilkie Collins వంటి వారు కూడా అంతే. .పూర్తివాస్తవికత మాత్రమే గౌరవనీయమని   అనుకోనక్కరలేదు .నిజాయితీ వున్న ప్రయత్నం యే  ప్రక్రియని అయినా వెలిగిస్తుంది.  ఆ పైన కాలమే నిర్ణయిస్తుంది .

16 comments:

  1. బ్లాగు తెరిచినందుకు సంతోషం, మరియు అభినందనలు. ఆంగ్ల సాహిత్య చరిత్రలో ఫేంటసీ ప్రస్థానాన్ని క్లుప్తంగా చక్కగా చెప్పారు. అవును, తెలుగులో కూడా అన్ని రకాల సాహిత్యమూ రావాలి.

    ReplyDelete
  2. స్వాగతం మైథిలి గారు. మీ బ్లాగు ప్రయాణం సరదాగా సంతోషంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

    వార్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి. వ్యాఖ్య పెట్టడానికి సులువుగా వుంటుంది.

    ReplyDelete
  3. మైథిలి గారికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీ నిమగ్న లో పొందుపరచిన విషయాన్ని చదివాను.ఒక కొత్త ఆలోచనా గవాక్షం తెరచినందుకు ధన్యవాదాలు.అభూత కల్పనలు, మంత్ర తంత్రాలు,క్షుద్రశక్తులు వగైరా గురించి పాశ్చాత్య సాహిత్య సమీక్ష చాలా బాగా చేశారు .తెలుగులో కూడా గతంలో చాల పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు చాలా తగ్గింది మా చిన్నతనం లో సహస్ర శిరచ్చేద అపూర్వచింతామణి విశేషాదరణ పొందింది.ప్రబంధాల్లో కళాపూర్ణోదయం అలాంటిదే. యండమూరి తులసిదళం సంగతి మీకు తెలిసిందే.ప్రస్తుతం నేను US లో ఉన్నాను .ఇక్కడటీవీల్లో
    ప్రసారమయ్యే సినిమామాలు చూసి మతి పోతుంది.అంతా ఫాంటసీనే.ఏది ఏమైనా అద్భుత రసాన్ని చిన్న చూపు చూడడం మాత్రం భావ్యం కాదనే మీ ఆలోచనను సమర్థిస్తున్నాను .

    Sent from http://bit.ly/f02wSy

    ReplyDelete
    Replies
    1. థాంక్ యు వెరీ మచ్
      అవునండీ..మీరు చెప్పినవి ఫాంటసీ లే..తులసిదళం హారర్ అనుకోవచ్చునేమో
      :)) ఇప్పటి సినిమాలు ఫాంటసీ విలువ తగ్గించేస్తున్నాయి..

      Delete
  4. VERY NICE EFFORT AND VERY GOOD STYLE.STILE-WELL FURTHER TO TOUCH THE FIRN OF HIMALAYAS...IF ITS YOUR VESTIGE ITS VERY WELL IN VIE WITH YOUR CHARMING FACE IF ITS YOUR FOCAL-POINT OF YOUR MIND ITS A REFLECTION OF YOUR SHEEN AND MATURITY OF YOUR THOUGHTS.. KEEP IT UP ,OH!TORCH BEARER OF OURS AND PREVIOUS GENERATIONS ...

    ReplyDelete
  5. Very nice post. Absolutely brilliant.

    ReplyDelete
  6. nijam cheppanaa? muktavarapu parthasarathi gari vistruta angla parisilana vyasam chadivinatlu...malatichandar gari paatakerataalu loni o keratanni chusinatlu anipinchindi! nijjangaa nijam!!

    ReplyDelete
  7. Mythili,.
    Hats off ! your blog is very good I was also a blog writer but stopped due to my bad language though many thoughts are there I am not venturing to express my self regarding some of books I read,. once again happy to read and understand your blogging very good keep it up..

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. superb.sahityam meeda meeku adhipatyam ledani cheppukovatam mee vinaya samskaram thappa nijam kaadu.

    ReplyDelete