Tuesday 5 November 2013

ఎం.ఎల్.వసంత కుమారి గారు

మద్రాస్ లలితాంగి వసంతకుమారి గారి పాట నాకు జోరున జడివాన కురుస్తున్నట్లుంటుంది . రసాల ఫలం పక్వమై రసం ఎగజిమ్ముతున్నట్లుంటుంది. రత్నాలని కుప్పపోస్తే ధగధగమంటున్నట్లుంటుంది. ప్రౌఢిమతో లాలిత్యం పొసగి ఒక శారీరమయితే , అదిగో, అట్లా ఉంటుంది. మాధుర్యపు మహాటవిలో సంచరిస్తున్నట్లుంటుంది. ఆ గాత్రం తిరిగే మెలికలు అంత పుష్టంగా పూర్ణంగా... అప్రయత్నంగా, అనాయాసంగా...ఇంకెక్కడా నాకు తట్టవు. ఏ కీర్తన ఎంచుకొని పాడినా ఇదివరకెప్పుడూ విననట్లే భ్రాంతి ...తనది మాత్రమే అయిన దేనినో అక్కడ ఆమె నింపిన బరువది... భ్రమ కాదు, సమ్మోహ విభ్రమం.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. MLV గారు అంటె నాకు వెంకటాచల నిలయం కీర్తన గుర్తొచెస్తుంది(సిందుభైరవి). నాతొ పాటు సంగీతం నెర్చుకొనేవారు నిత్యశ్రి, బొంబే జయశ్రీ, ప్రియా సిస్టెర్స్ పాటలు విని, వాళ్ళని worship చెస్తుంటే, నెను GNB, MLV, DKPమొదలగువారికి పూజ చెస్తుండేవాడిని. I love her typical sangathis. ఆమె పాడిన భూకైలాస్ సొంగ్స్ మర్చిపొగలమా? మీ వర్ణన లొ యేమాత్రమూ అతిశయొక్తి లెదు. "జోరున జడివాన, రసాల ఫలం పక్వమై రసం ఎగజిమ్ముతున్నట్లుంటుంది. రత్నాలని కుప్పపోస్తే ధగధగమంటున్నట్లుంటుంది." Thanks a lot for this cute write-up

    ReplyDelete
    Replies
    1. మీది పరిణతమైన అభిరుచి అండీ నిజంగా. నాకు ఎన్నో యేళ్లు బాలమురళి గారు మాత్రమే నచ్చేవారు. ఆ తర్వాత ఎం.ఎస్.సుబ్బలక్ష్మి . ఎం.ఎల్.వి .పాట లో సౌందర్యం తెలుసుకోవటానికి చాలా కాలమే పట్టింది నాకు. అవును,' మున్నీట పవళించు ' లోకోత్తరంగా ఉంటుంది కదా.

      Delete