Tuesday 5 November 2013

Thirst unquenchable

వెంటాడే జ్ఞాపకం. పదే పదే మ్రోగుతున్న హృదయం. శ్రావణమేఘాలయిపోయిన నయనాలు....వ్యాకులత , ఉన్మత్తత.ఎప్పుడో ఒక్క క్షణం తళుకుమన్న మెరుపు కాంతిలో కాలానికి అవతల ఏ గడిచిన జన్మలోనో కనిపించిన రూపం..స్పష్టమవదు, మాసిపోదు...ఆశనిరాశల ఊయలలో అలసిపోతూ నలిగిపోతూ... ఎంత సిక్తమయిపోతున్నా ఉపశమించని తృష్ణ ! భావాన్ని మాటలలో అందుకొనే ప్రయత్నం చేయవచ్చు, ఈ గానాన్ని కాదు. కిషోర్ కుమార్ కి నమస్కారం. ఉల్లాసభరితమైన పాటలకి ప్రసిద్ధికెక్కిన ఆయన  ఈ పాట లో పలికించిన ఆర్తి అనుపమానం. ఆనంద్ బక్షీ గీతానికి ఈ చిత్రహింసపెట్టే స్వరరచన ఆర్. డి. బర్మన్ ది. ఒక్క అన్యస్వరం పడకుండా ఒక్క పద్ధతి తప్పకుండా పూర్తిగా శివరంజని రాగంలో చేశారట. అందుకు ఆ రాగానికి ఉద్దేశించబడిన అనుభూతి, వాతావరణం సరిగ్గా వచ్చాయట. . [ మేరా నాం జోకర్ లో ' జానే కహా ' , బీస్ సాల్ బాద్ లో ' కహీ దీప్ జలే ' ఈ రాగంలో చేసినవే ] http://www.youtube.com/watch?v=VvKng8fegVo [mehbooba]

No comments:

Post a Comment