Tuesday 5 November 2013

సున్నా కి ఇటు వైపున ఏది లేకపోతేనేం ?

ఈ పాట ఎత్తుగడే ఆర్తనాదం లా అనిపిస్తుంది.ఆ చివర్న ఎక్కడో...చిన్న ఆశ. పాడుబడిపోలేదూ అంతా...కాదు ఇంకా మిగిలే ఉంది, పాతబడినది గాయం మటుకే. చెంపలు నెరిసిపోయాయిగా, పంతాలూ ఇంక చాలు.అట్లాగే అయిందో లేదో, ఈ పాట అట్లాగే ఆగాలని నాకు.

మరీ మరీ వలచి వరించి మ్రోగే సంగీతమై జీవించి...ఎందుకు అప్పుడు అలా...కాలాన్నా అనవలసింది, ముందు ఆమెని, తర్వాత అతన్ని.

నిజజీవితపు ఆధారం ఉందనుకున్నా అనుకోకపోయినా ఈ సందర్భం, దానికి దారి తీసిన ప్రాధాన్యత ల ఎంపిక లో పొరబాటు [అవునా? ] ఆ రోజులకి చాలా సంక్లిష్టమైనవి. గుల్జార్ కి గీత రచయితగా, దర్శకుడిగా ఇది విజయం అనటానికి నోరు రాదు నాకు, అంత దిగులు.

సంజీవ్ కుమార్ లేడు ఇందులో, జె.కె.అనే హోటల్ మానేజర్ మాత్రమే ఉన్నాడు, కురిసీ కురవని మేఘం లాగా. వడిలిపోయిన పువ్వు సుచిత్రా సేన్.

పాడటం లోనూ నా పక్షపాతం కిషోర్ కుమార్ పైనే, లత ఎంత ఆర్తి ని పలికించినా.

ఈ వింటూన్న, రాస్తున్న నిమిషాలలో  నన్నూ మబ్బులు కమ్మేశాయి. ఆర్.డి. నిర్దయగా పిండేసి వదిలిన గుండె ని సరిచేసుకోవాలి, సెలవు.
http://www.youtube.com/watch?v=wGLzi7OL7P8[ aandhi]

No comments:

Post a Comment