Tuesday 5 November 2013

M S Subblukshmi

సాంద్రమైన సాంబ్రాణి ధూపం ఆమె కంఠం. ఆ చిక్కని పొగలమధ్య అడ్డాలలో బిడ్డలమయిపోతాము...అప్పటి ఆనందం అవ్యక్తం, ఇప్పటిది వ్యక్తమధురం, చివరకు ఇంద్రియాతీతం. ఆ మధుకాంతి ఆమె రూపం కూడా, వృద్ధభార్గవి ఆమె. సదాశివం గారు ఉన్నప్పుడూ వెళ్లిపోయాకా కూడా ఆమె మంగళగౌరీ స్వరూపమే. సరస్వతీదేవి త్యాగరాజుల తపసుని మెచ్చుకొని దక్షిణభారతానికి దిగివచ్చి ఒక పూర్ణ మానవజీవితం జీవించింది. దివ్యత్వానికీ ప్రత్యక్షానికీ భేదం లేని ఆ కొన్ని కాల సుకృతాలలో ఆమె ఒకరు. చాల పెద్దమ్మ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జన్మదినం నేడు[సెప్టెంబర్ 16] ఆమె తినిపించిన అన్నమయ్య గోరుముద్దలెంత  కమ్మన....

No comments:

Post a Comment