Tuesday 5 November 2013

కొండగాలి తిరిగింది

అవును మలయమారుతం.ఒక్క గాలి విసురుకి ఆ కొండవాలులోకి విసిరివేయబడతాము..ఈ పాట ని దృశ్యంగా చాలా ఏళ్లు చూడనేలేదు,అసలు ఆ వెలితే తట్టలేదు .మధ్యలో వచ్చే ఆలాపనకి సుఖంగా రెపపలాడుతుంది గుండె.ఇంటర్ లూడ్ లు ఏటిలో కెరటాలు..కదలికలో ఇంత స్థిమితం ఉంటుందా...అవును,ఇది ఉయ్యాల కదా మరి.సాహిత్యం...అన్ని పదాలు,ప్రయోగాలు ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి నాకు.పదచిత్రాలు,అవి కల్పించే ఇమేజరీఇంద్రజాలం.మొగలిపూల వాసనతో మురిసిపోవటం ఏమిటో ఎంత తలచుకున్నా పూర్తిగా తెలిసిపోదు.[ఆ తర్వాత విరివిగా వాడుకున్న సిరివెన్నెల అనే మాట ఆరుద్ర గారు మల్లాది వారి శిష్యులని పట్టి ఇస్తుంది.]

2 comments:

  1. ఆరుద్ర సాక్షిలో క్లైమాక్స్ పాట రాయలేక గిలగిలలాడినపుడు ఓమాటు మల్లాదివారిని ఆవాహన చేస్కున్నారట. ఈ పాట మా గురువుగారు ఐతే ఎలా రాస్తారు అని ప్రశ్నించుకుని మొదలుపెడ్తే మూడ్రోజులు వేధించిన పాట గంటలో తయారైంది. అదే "అమ్మకడుపు చల్లగా.. అత్తకడుపు చల్లగా. బతకరా బతకరా నిండుగా"

    ReplyDelete