Tuesday 5 November 2013

మునిపల్లె రాజు గారి కథలు

నేను చాలా ఆలస్యం గా చదివిన రచయిత మునిపల్లె రాజు గారు. ప్రాతః కాలపు మంగళ వాద్య సంగీతం ఆయన రచన.పాతకాలపు రచన, పరిపూర్ణమైన రచన.

' మునిపల్లె రాజు కథలు ' అని చిన్న సంపుటి వచ్చింది మొదట, 1990 లలో. ' ఆవలి పక్షం ' కథ బహుశా అందులోదే. ఇది కరెక్ట్, ఇది కాదు అనే తీర్పు ఇస్తోందేమోనని అనిపించవచ్చు , కాని, రచయిత ఆ మాట చెప్పనే కూడదని ఎక్కడా లేదు కదా. ప్రసిద్ధి వచ్చిన ' యశోద కొడుకు ' అందులోదే...ఆ కథాకాలం తో నా వయసు వారికి కూడా పరిచయం లేకపోయినా, అది చక్కగా మలచిన కథ. కథ చెప్పే వ్యక్తి ఒక యువకుడిని చూసి ఎక్కడో చూసినట్లుందే అనుకుంటాడు...ఆ చూసినది తన పోలికలనే అంటాడు చివరికి.

రెండో సంపుటి ' పుష్పాలూ ప్రేమికులూ పశువులూ '. టైటిల్ కథ లో వాతావరణమూ అపరిచితం గానే ఉంటుంది, కాని ఆకర్షిస్తుంది. ఇంచుమించు ఇంగ్లీష్ కథల శిల్పం లా ఉంటుంది, కొస మెరుపు తో సహా. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన కథ ' ఒక బాకీ తీరలేదు '.రాజు గారి చాలా కథలలో లాగే పెరిగి పెద్దవాడయిన అనాథ తన గతాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణం ఇందులోనూ. ఈ కథ లో అతను స్థితిమంతుడు, ఒకనాడు తన కడుపు నింపి ఆదరించిన స్త్రీని సందర్శించాలని వస్తాడు ఆ ఊరికి మళ్లీ. మంచి యెండన పడి తిరుగుతూ ఉంటే నరసరావు పేట మాండలికం మాట్లాడే ముసలమ్మ ఎదురయి ఆతిథ్యం ఇస్తుంది. నేనూ ఆ వేడి గాడ్పుకీ సేదదీర్పు కీ అక్షరాలా లోనయిపోయాను. ఆ వెతికే అక్క ' కమలమ్మ ' అప్పటికి ఉండదు, ఉండకపోవటం లో ఏమీ అశుభమూ ధ్వనించదు. కాలధర్మం అనిపిస్తుందంతే. ఈ ముసలమ్మకీ తన సాయం అక్కర్లేదని అర్థమవుతుంది, అందుకునేను చాలా ఆలస్యం గా చదివిన రచయిత మునిపల్లె రాజు గారు. ప్రాతః కాలపు మంగళ వాద్య సంగీతం ఆయన రచన.పాతకాలపు రచన, పరిపూర్ణమైన రచన.

' మునిపల్లె రాజు కథలు ' అని చిన్న సంపుటి వచ్చింది మొదట, 1990 లలో. ' ఆవలి పక్షం ' కథ బహుశా అందులోదే. ఇది కరెక్ట్, ఇది కాదు అనే తీర్పు ఇస్తోందేమోనని అనిపించవచ్చు , కాని, రచయిత ఆ మాట చెప్పనే కూడదని ఎక్కడా లేదు కదా. ప్రసిద్ధి వచ్చిన ' యశోద కొడుకు ' అందులోదే...ఆ కథాకాలం తో నా వయసు వారికి కూడా పరిచయం లేకపోయినా, అది చక్కగా మలచిన కథ. కథ చెప్పే వ్యక్తి ఒక యువకుడిని చూసి ఎక్కడో చూసినట్లుందే అనుకుంటాడు...ఆ చూసినది తన పోలికలనే అంటాడు చివరికి.

రెండో సంపుటి ' పుష్పాలూ ప్రేమికులూ పశువులూ '. టైటిల్ కథ లో వాతావరణమూ అపరిచితం గానే ఉంటుంది, కాని ఆకర్షిస్తుంది. ఇంచుమించు ఇంగ్లీష్ కథల శిల్పం లా ఉంటుంది, కొస మెరుపు తో సహా. ఇక్కడ నాకు చాలా ఇష్టమైన కథ ' ఒక బాకీ తీరలేదు '.రాజు గారి చాలా కథలలో లాగే పెరిగి పెద్దవాడయిన అనాథ తన గతాన్ని వెతుకుతూ చేసిన ప్రయాణం ఇందులోనూ. ఈ కథ లో అతను స్థితిమంతుడు, ఒకనాడు తన కడుపు నింపి ఆదరించిన స్త్రీని సందర్శించాలని వస్తాడు ఆ ఊరికి మళ్లీ. మంచి యెండన పడి తిరుగుతూ ఉంటే నరసరావు పేట మాండలికం మాట్లాడే ముసలమ్మ ఎదురయి ఆతిథ్యం ఇస్తుంది. నేనూ ఆ వేడి గాడ్పుకీ సేదదీర్పు కీ అక్షరాలా లోనయిపోయాను. ఆ వెతికే అక్క ' కమలమ్మ ' అప్పటికి ఉండదు, ఉండకపోవటం లో ఏమీ అశుభమూ ధ్వనించదు. కాలధర్మం అనిపిస్తుందంతే. ఈ ముసలమ్మకీ తన సాయం అక్కర్లేదని అర్థమవుతుంది, అందుకు చిన్నబుచ్చుకోకూడదనీ తెలుస్తుంది.

మూడో సంపుటి ' దివో స్వప్నాలతో ముఖాముఖి '
 ఈ టైటిల్ కథ అద్భుతంగా ఉంటుంది.ఇదీ జీవన పునర్నిర్మాణం గురించే, కాని అతి సమగ్రం అనిపిస్తుంది నాకు. ఆ మాటకొస్తే రాజు గారి ఏ కథయినా చదవటం ముగించాక ఇక చెప్పవలసినది ఉందని నాకెప్పుడూ అనిపించలేదు.

' సవతి తమ్ముడు ' నా ఆల్ టైం ఫేవరిట్. వేర పనోవ అనే రష్యన్ రచయిత్రి[ ఈవిడ నవలిక ' పెద్ద ప్రపంచం లో చిన్న పిల్లడు ' రాదుగ వారి తెలుగు అనువాదం ఉంది ] కథ 'సిస్టర్స్ ' ఆధారం గా తీసిన సినిమా కథ మధ్యలో. అంతకుముందు సాధికారంగా వర్ణించిన నాయకుడి మిలిటరీ వాతావరణం, భోజనశాల. ఆ తర్వాత సవతి తల్లి మీది కోపం కరిగి మాయమై తమ్ముడి పైని మమతా బాధ్యతా స్ఫురించటం.నేనూ ఆత్రపడ్డాను ఆ పిల్లవాడిని పరుగెత్తి వెళ్లి ఆదుకోవాలని.
ప్రతి కథా ఇంచుమించు అలాగే ముగుస్తుంది. భారతీయమైన  పూర్వ కావ్య మర్యాద అది, ఆశ తో ముగించటం, ఆనందాన్ని సూచించటం. ఆ తర్వాత మాజిక్ రియలిజం కథలు అని మరో సంపుటి వచ్చింది. కాని ఆ ప్రక్రియ తో రాజు గారి కథలకి, జీవం తో పొంగి పొరలే నదీనదాల వంటివాటికి ..ఈ కొత్త ఒరవడి  వేరే అందం తెచ్చి పెట్టిందనునుకోలేదు  నేను.

ఇక్కడ  ప్రస్తావించని మంచి కథలు చాలా ఉన్నాయి ఆయనవి. అన్ని కథలూ ఒకే సంపుటంగా ఇప్పుడు దొరుకుతున్నాయి.

No comments:

Post a Comment