Tuesday 5 November 2013

వెన్నెల



'' నిండు వెన్నెల, పండు వెన్నెల ఈ రెండు మాటలూ ఎంత వేరో చూడు, ప్రతి పదానికీ రంగూ రుచీ వాసనా ఉంటాయి '' అని కృష్ణశాస్త్రి గారు అనేవారని జలంధర గారు ఒక వ్యాసం లో రాస్తారు.

అనుకున్న పదం దొరికేవరకూ ఆయన మథన పడుతూనే ఉండేవారట. శబ్దానికి ఎంత ప్రాధాన్యత ఉందో సాధికారంగా తెలిసిన తెలుగు కవులలో ఆయన ఒకరు...అర్థమంతకన్న రమ్యమయి మనకు అందింది కదా ఆ కవిత్వం ద్వారా.

సినిమా పాటకి రామణీయకమైన మర్యాద వచ్చింది ఆ రచనతో. కవిత్వం అంటే ఇలా ఉంటుందనే పరిచయం రెండు తరాలవారిలో ఎంత మందికో చేసిన పాటలు అవి.వింటూనే అది ఆయన రాశారని చెప్పగలవారికీ కొదవ లేదు.

ఇవాళ[ November 1st ]  జయంతి. జయంతి మాత్రమే ఉండే రససిద్ధుడు ఆయన .

No comments:

Post a Comment