Tuesday 5 November 2013

neela aasman

ఆ మేఘ నిస్వనం వంటి స్వరం లయలో ఒదిగీఒదగనట్లుంది. గాటపు వలపు బరువుకి హృదయం తొణికీ తొణకనట్లుంది. కురిసే మంచు, వణికే పెదవులు....మాటలు రావు, పాట ఒకటే, మంద్రంలో  గాలిపాట.  కాలం మెల్లగా, అతి మెల్లగా కదులుతోంది.మబ్బుల్లోకి జారే చంద్రుడు సవ్వడి చేయడు . అనురాగానికి అవధి ఈ వేళలో ఒక లజ్జామధుర సామీప్యం...  శాంతమైన ఆశ్లేషం. ఆమె, అతను, నిశ్శబ్దం...ప్రపంచం ఒక మౌనవాటిక...నీలాకాశం నిద్రపోయింది. ఆ శరత్ యామిని, బహుశా ఒక కొండవాలు.ఆరామం, చల్లగాలి,పచ్చిక బయలు - అమృతసిక్తమయిన జంట ....స్వప్నలోకపు జోలపాట.

http://www.youtube.com/watch?v=fCUJkbrym2I[ silsila]

No comments:

Post a Comment